క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, అయితే ప్రధాన పోటీ BRS, కాంగ్రెస్, మరియు BJP పార్టీల మధ్య నెలకొంది.
Also Read:జూబ్లీహిల్స్ లో ఈ రెండు రోజులు అన్ని కార్యాలయాలకు సెలవు
బీఆర్ఎస్ కాండిడేట్ గా మాగంటి సునీత (మాగంటి గోపీనాథ్ భార్య), కాంగ్రెస్ కాండిడేట్ గా నవీన్ యాదవ్, బిజేపి కాండిడేట్ గా లంకల దీపక్ రెడ్డి లు బరిలో వున్నారు. పోలింగ్ సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాలతో సమస్యాత్మక ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.
ప్రముఖ సినీ దర్శకుడు S.S. రాజమౌళి మరియు ఇతర రాజకీయ నాయకులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఓటింగ్ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా పుంజుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:పోలింగ్ వేల కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ లో పర్యటించడంపై ఈసీ సీరియస్?
Also Read:వరల్డ్ కప్ విన్నర్ కు వెస్ట్ బెంగాల్ అరుదైన గౌరవం… రిచా పేరిట స్టేడియం ఏర్పాటు?





