
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నేడు పోలింగ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం ప్రతి ఒక్కరిని కూడా నిరాశ పరుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు కేవలం 21% మాత్రమే ఓటింగ్ నమోదయింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి ముగ్గురు నాన్ లోకల్ నేతలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మరోవైపు బీహార్ లో 11 గంటలకు 31 శాతం పోలింగ్ నమోదయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బస్తీల నుంచి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులు ఉండే కాలనీల నుంచి మాత్రం ఒకరు కూడా ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అభివృద్ధి మరియు సమస్యల గురించి ప్రశ్నించేటువంటి హక్కు అనేది ఉంటుంది. ఓటు వేయకుంటే ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి హక్కులు లేవని చాలామంది గ్రహించట్లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, ధనికులు అలాగే యువతులు అందరూ కూడా ఇప్పటికైనా మేల్కొని ఓటు వేయడానికి కదలి రావాలి అని పలువురు చెబుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 100% ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
Read also : పహల్గాం దాడి తరువాత.. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్ర మోడీ హెచ్చరిక.. ఇక వారి గతి అంతే!
Read also : చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి





