
రామకృష్ణాపూర్,( క్రైమ్ మిర్రర్):- క్యాతనపల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపాలిటీలోని ఒకటో వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు తీగల రమేష్, రాసా సంపత్, పులి శ్రీనివాస్, గోమాస కుమారస్వామి, ప్రభాకర్లతో పాటు బి-జోన్ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు ఆడెపు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.





