Homeతెలంగాణగెలుపే లక్ష్యంగా జిన్నారెడ్డి ప్రచారం

గెలుపే లక్ష్యంగా జిన్నారెడ్డి ప్రచారం

క్రైమ్ మిర్రర్,నేరేడుచర్ల:- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిన్నారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని 2,6,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు.2,6,14 వార్డులలో ఎన్నికల ప్రచారం లో పాల్గోని ఓటర్లు కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని ఇప్పటికే నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదనీ మున్సిపాలిటీ పదిహేను వార్డులు గెలుచుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కానుకగా ఇస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.ఎంతమంది ఓటర్లను ప్రలోబాలకు గురిచేసిన ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తారని తెలిపారు.గెలిచినా తర్వాత నేరేడుచర్ల మున్సిపాలిటీ ని అభివృద్ధి లో ముందుకు తీసుక వెళ్లుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ధులు, ప్రజలు పాల్గొన్నారు.

Read also : మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌… ఇవాళ్టి నుంచి వైన్స్‌లు బంద్‌

Read also : ఇకపై గోవాలో అలా చేస్తే జైలుకే..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments