క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా హిమని ని వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పెళ్లి ఫోటోలను నీరజ్ చోప్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్లో ఆ ఫోటోల కింద నీరజ్ చోప్రా లవ్స్ హిమని అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలనేవి వైరల్ అవుతున్నాయి. కాగా భారత జావెలన్ త్రోయర్ అయినా నీరజ్ చోప్రా మన భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించాడు. దీంతో మన దేశం మొత్తం మీద చాలా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు నీరజ్ చోప్రా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. అయితే నీరజ్ చోప్రాను పెళ్లి చేసుకున్న హిమని బ్యాక్ గ్రౌండ్ తెలియాల్సి ఉంది. కాగా నీరజ్ చోప్రా అభిమానులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1.ఖో ఖో వరల్డ్ కప్ విజేతగా భారత్!..
2.అవినీతి ఆరోపణలు, తోటి సిబ్బందితో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం!!