
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచంలోనే టెక్నాలజీలో టాప్ లో ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. అయితే జపాన్ తాజాగా మరొకసారి కొత్త రికార్డు సృష్టించింది. సరికొత్తగా టెక్నాలజీ తో జపాన్ దేశం తాజాగా ఇంటర్నెట్ స్పీడ్ లో రికార్డు బద్దలు కొట్టింది. కేవలం ఒకే ఒక సెకన్ లో నెట్ ఫ్లిక్స్ డేటా మొత్తం కూడా డౌన్లోడ్ చేసేలా తయారు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్ ను సృష్టించి జపాన్ దేశం ప్రపంచ రికార్డును నమోదు చేసింది. దీంతో ప్రపంచంలోని ప్రతి దేశం కూడా జపాన్ వైపు తలెత్తి చూస్తుంది. టెక్నాలజీలో ఎంత ఫాస్ట్ గా ఉన్నామని జపాన్ దేశం మరోసారి క్లారిటీగా రుజువు చేసింది. కేవలం ఒకే ఒక సెకండ్ కు 1.02 పెటా బైట్స్ వేగంతో అంటే ( పెటా బైట్ = 10 లక్షల gb లు) లను ట్రాన్స్ఫర్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ వేగంతో ఒక్క సెకన్ లోనే నెట్ఫ్లిక్స్ లోని డేటా మొత్తం కూడా డౌన్లోడ్ చేయొచ్చు అని తెలిపింది. అలాగే 150 జీబీ వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది మన భారతదేశపు ఇంటర్నెట్ స్పీడ్ టెక్నాలజీతో పోల్చుకుంటే దాదాపు 16 మిలియన్ రెట్లు వేగవంతమైనదని తెలుస్తుంది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే జపాన్ దేశం టెక్నాలజీలో మొదటి స్థానంలో ఉంటూ తన రికార్డులను మరోసారి బద్దలు కొడుతుంది. జపాన్ టెక్నాలజీని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వడంతో పాటు… ఆ దేశ టెక్నాలజీని చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అభివృద్ధిదేశంగా జపాన్ ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు.