
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులపై క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. నలుగురిని ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవడంతో కేబినెట్ విస్తరణపై చర్చించారనే వార్తలు వచ్చాయి. మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైందనే సమయంలో .. ఢిల్లీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదంటున్నారు. మంత్రివర్గ కూర్పుపై ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ఆగిపోయిందనే చర్చ సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ విషయంలో పార్టీలో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. వీళ్లద్దరికి వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు సీన్ లోకి రావడం వల్లే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందని తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణలో తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందనే ధీమా వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనకు హోంశాఖ అంటే ఇష్టమని కూడా కామెంట్ చేశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. హైకమాండ్ కు ఆయన రాసిన లేఖ ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మంత్రివర్గ విస్తరణపై రాసిన లేఖలో జానా రెడ్డి కీలక పాయింట్లు లేవనెత్తారు. నల్గొండ జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి అవసరన లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవద్దన్న సంకేతం వచ్చేలా ఢిల్లీ లీడర్లకు లేఖ రాశారు పెద్దలు జానా రెడ్డి.
Also Read : ఇటు కేసీఆర్…అటు జగన్.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడమా..? అవమానించడమా?
నల్గొండలో ఇప్పటికే ఇద్దరు రెడ్లకు మంత్రి పదవులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు జానారెడ్డి. కాబట్టి నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి అవసరం లేదని.. కానీ ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కని రంగారెడ్డి జిల్లాకు స్థానం కల్పించాలని ఏఐసీసీ పెద్దలకు లేఖ రాశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా పార్టీకి లాభమేనని లేఖలో జానారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కావాలని.. హైకమాండ్ కు సిఫారసు చేయడం వెనుక అంతుబట్టని రాజకీయం ఉందని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రి పదవి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావడం లేదు. జానారెడ్డి ఇప్పుడు పవర్ ఫుల్ గా కనిపిస్తుండటంతో ఆయనను మల్ రెడ్డి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరుడు శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకుని తన పవర్ ఏంటో చూపించారు జానారెడ్డి.. అందువల్లనే మల్‌రెడ్డి రంగారెడ్డి జానా రెడ్డి సాయం కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోసం జానారెడ్డి లేఖ సాయం చేశారని భావిస్తున్నారు. మల్ రెడ్డి మంత్రివర్గ రేసులోకి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనట్టే.
Also Read : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పై బెట్టింగులు…!
జానారెడ్డి ఎంట్రీతో రాజ్‌గోపాల్‌రెడ్డికి పదవి దక్కదనే ప్రచారం జోరుగా సాగుతోంది. జానారెడ్డి లేఖ తర్వాత పార్టీ పెద్దలు రాజ్‌గోపాల్ రెడ్డి పేరును పక్కన పెట్టేస్తారని టాక్ వినిపిస్తోంది. రాజ్‌గోపాల్ రెడ్డి స్థానంలో మల్‌రెడ్డి రంగారెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. మల్ రెడ్డికి మంత్రిపదవి ఇప్పించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా జానారెడ్డిని సీన్ లోకి దించారనే టాక్ కూడా వస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు. ఇప్పుడు కొంత దగ్గర అయినట్లు కనిపిస్తున్నా కోమటిరెడ్డితో ఎప్పటికైనా ప్రమాదమేనని రేవంత్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఆడిస్తున్నారనే టాక్ వస్తోంది.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తన అనుచరుడు మల్ రెడ్డికి మంత్రి పదవితో పాటు కోమటిరెడ్డికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు.