
-
పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి
-
సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపైనే నిమగ్నం
-
కూటమిలో కొనసాగుతూనే జనసేన బలోపేతానికి వ్యూహాలు
క్రైమ్ మిర్రర్, అమరావతి: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన ఫోకస్‌ను పార్టీకి వైపునకు మళ్లించారు. ఇకపై జనసేన బలపడే దిశగానే వ్యూహరచన చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్. దీనికోసం సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీ నిర్మాణం వైపే దృష్టి పెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూనే జనసేన బలపడేలా వ్యూహాలు రచిస్తున్నారు పవన్.
జనసేన పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాలపై పవన్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్సనల్ సర్వే చేయించారట పవన్. సుమారు 50 నియోజకవర్గాల్లో జనసేనకు తిరుగులేదని సర్వేల్లో తేలిందని వినికిడి. ఈ నేపథ్యంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి పవన్ నిర్ణయించారట. ఈ మేరకు త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం చేయనున్నారట పవన్. అలాగే ఇంటింటికీ జనసేన అనే కొత్త కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Read Also: