తెలంగాణరాజకీయం

కోమటిరెడ్డిపై జానారెడ్డి రాజకీయం - రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవికి జానా ఎర్త్‌

  • ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి ఆశిస్తోన్న జానారెడ్డి

  • ఒకే జిల్లా నుంచి నలుగురికి ముఖ్య పదవులా?

  • నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికే ప్రాధాన్యమా?

  • జానారెడ్డి లేఖతో ఆగిన మంత్రివర్గ విస్తరణ

  • అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన పదవుల పంపిణీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పబ్లిక్ మీటింగ్‌లోనే టార్గెట్ చేయడం ఈ తీవ్ర దుమారానికి కారణమైంది. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల జానారెడ్డే కోమటిరెడ్డికి చెక్ పెట్టారన్న పుకార్లు ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విషయంలో సొంత పార్టీ నేతలే మరో షాకింగ్ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు నల్గొండ ఎంపీగా, మరొకరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా కూడా జానారెడ్డి మరో కీలక పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా తనను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని, ఇదే ఇప్పుడు అసలు సమస్యకు కారణమని సమాచారం.


Also Read : రాజగోపాల్ రెడ్డి మంత్రి కాకుండా జానారెడ్డి అడ్డుకున్నది ఇందుకేనా?


చిచ్చుపెట్టిన జానా రెడ్డి లేఖ ! 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆది నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కేబినెట్‌ విస్తరణ జరిగితే ఆయనకు మంత్రి ఖాయమనే భావన అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అదే సామాజికవర్గానికి చెందిన జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురికి ప్రభుత్వంలో ముఖ్య పదవులు ఇస్తే అటు పార్టీలో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా చేయాలనే ఎత్తుగడను జానారెడ్డి తెరపైకి తెచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్‌లో ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ రాశారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే జానారెడ్డి రాసిన లేఖ పార్టీలో పెద్ద దుమారమే లేచింది. మంత్రివర్గ విస్తరణను సైతం అధిష్టానం పక్కనబెట్టింది.


Also Read : తగ్గేదేలే అంటున్న స్మితా సబర్వాల్‌ – ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు 


మండిపడుతున్న రాజగోపాల్‌రెడ్డి!

ఇదిలా ఉంటే జానారెడ్డి లేఖ రాయడంపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ధ్వజమెత్తారు. జానారెడ్డికి 25 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించినప్పుడు ఇతర జిల్లాల గురించి గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీలో ధర్మరాజు గా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి గా వ్యవహరిస్తున్నాడంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన అధిష్టానం నిజంగా రాజగోపాల్ రెడ్డికి అవకాశమిస్తుందా లేక జానారెడ్డి రాసిన లేఖతో పక్కన పెట్టేస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అంతేకాదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇద్దరు నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆ పార్టీ కేడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి .. 

  1. సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button