ఆంధ్ర ప్రదేశ్

జూన్‌ 10లోపు జగన్‌ అరెస్ట్‌ - కూటమి ప్లాన్‌ బయటపెట్టిన విజయసాయిరెడ్డి

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : కూటమి టార్గెట్‌ జగనేనా..? మద్యం స్కామ్‌ వెలికితీసింది జగన్‌ను కటకటాల వెనక్కి నెట్టడం కోసమేనా…? ఢిల్లీ తరహా పాలిటిక్స్‌ ఏపీలో కూడా జరగబోతున్నాయా…? లిక్కర్‌ స్కామ్‌తో ఆమ్‌ ఆద్మీ పార్టీని దెబ్బతీసినట్టే… ఏపీలో కూడా వైసీపీని దెబ్బకొట్టాలని స్కెచ్‌ వేశారా…? జగన్‌ను అరెస్ట్‌ చేయిస్తే.. వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టినట్టే అని భావిస్తున్నారా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పటి జగన్‌ సన్నిహితుడు విజయసాయిరెడ్డి… ఇప్పటి… తన సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకున్నారట. అతి త్వరలోనే… అంటే.. మరో 10 రోజుల్లో జగన్‌ అరెస్ట్‌ తప్పదని విజయసాయిరెడ్డి చెప్పినట్టు సమాచారం.

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో వైఎస్‌ జగన్‌ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇక.. అరెస్టే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. జూన్‌ 10లోపు జగన్‌ అరెస్ట్‌ ఖాయమన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 3వేల 500 కోట్ల రూపాయల స్కామ్‌ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో… దర్యాప్తు కీలక దశలో ఉంది. ఇప్పటికే సూత్రధారులు.. పాత్రధారులను అరెస్ట్‌ చేశారు. సూత్రధారిగా రాజ్‌ కసిరెడ్డిని…. పాత్రధారులుగా సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి, జగన్‌ OSD కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే.. గోవిందప్ప బాలాజీని కూడా అరెస్ట్‌ చేశారు. నెక్ట్స్‌ అరెస్ట్‌… ఈ స్కామ్‌లో బిగ్‌బాస్‌దే అంటున్నారు. బిగ్‌బాస్‌ ఎవరు అంటే.. ఇంకెవరు వైఎస్‌ జగన్‌ అన్న టాక్‌ వినిస్తోంది.

వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేసేందుకు… కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్మిషన్‌ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని.. విజయసాయిరెడ్డే తన సన్నిహితులతో చెప్పారట. జగన్‌ అరెస్ట్‌ తప్పదని.. మరో 10 రోజుల్లో ఆయన్ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది.

మద్యం స్కామ్‌లో ఏ-5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. అయితే… ఈ కుంభకోణంతో తనకు సంబంధం లేదని… తనకు తెలిసిన సమాచారం అంతా చెప్తానని.. సిట్‌ అధికారులకు చెప్పారాయన. లిక్కర్‌ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ అంతా రాజ్‌కసిరెడ్డే అని విజయసాయిరెడ్డే చెప్పారు. అంటే.. ఆయన అప్రూవర్‌ మారిపోయినట్టే. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందన్నది కూడా విజయసాయిరెడ్డే ఆధారాలతో సహా ఇస్తున్నట్టు సమాచారం. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ఇటీవలే.. వైఎస్‌ జగన్‌ కూడా ఆరోపించారు. కావాలంటే తనను అరెస్ట్‌ చేసుకోవచ్చని.. విజయవాడలోనే ఉంటానని కూడా జగన్‌ సవాల్‌ చేశారు. కూటమి ప్రభుత్వం నెక్ట్స్‌ స్టెప్‌ అదే అని భావించే జగన్‌ ఈ సవాల్‌ చేశారని సమాచారం. ఏది ఏమైనా… జూన్‌ 10లోపు జగన్‌ అరెస్ట్‌ ఖాయమన్న వార్త.. ఏపీ రాజకీయాల్లో కోడై కూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button