
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలను ఎగగొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలందరినీ కూడా మోసం చేశారు అని జగన్ తీవ్రంగా విమర్శించారు. మరి ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే సీఎంపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి కదా?.. అని వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు అని?.. ఇలాంటివారిని కచ్చితంగా జైల్లో పెట్టాలి కదా అని నిన్న జరిగినటువంటి ఓ మీడియా సమావేశంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలను పూర్తిగా మోసం చేశారని అన్నారు. గత మా ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందినటువంటి నాడు-నేడును పూర్తిగా ఆపివేసి నేడు చదువుకోలేనటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసేసారు అని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. గత మా ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చి ప్రజలకు అండగా నిలబడితే నేడు కూటమి ప్రభుత్వం మాత్రం నిండా ముంచిందని వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వంలో పాఠశాల రూపురేఖలు మారిపోతే.. ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం పాడు చేసేసారు అని అన్నారు. మరోవైపు వర్షాలు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతింటే కనీస గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also : సీఎం రేవంత్ రెడ్డి నేటి వరంగల్ పర్యటన వివరాలు..!
Read also : ప్రకాశం జిల్లా పొదిలి లో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ జనం!




