ఆంధ్ర ప్రదేశ్

తప్పు తెలుసుకున్నా.. ఆ పొరపాటు మళ్లీ చేయనన్న జగన్‌!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వైఎస్‌ జగన్‌ ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా..? గత ఐదేళ్లలో చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నారా..? జరిగిన పొరపాట్లను గ్రహించారా..? ఆయన మాటలు వింటే… అవుననే అనిపిస్తోంది. పొరపాటు జరిగిందని గ్రహించిన ఆయన… దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా…? ఇంతకీ వైసీపీ హయాంలో జరిగిన తప్పేంటి…? జగన్‌ ఏం చెప్పారు..?

కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. దానం వరకు అది ఓకే. కానీ.. రాజకీయాల్లో… అది వర్కౌట్‌ కాదు. పాలిటిక్స్‌లో ప్రజలకు ఎంత చేశాం అనే దాని కన్నా… చేసిన పనులను ఎంత బాగా ప్రచారం చేసుకున్నామన్నదే ముఖ్యం. చిన్న మంచి చేసినా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి లేదంటే… ప్రయోజనం ఉండదు. ఓట్లు రాలవు. వైసీపీ హయాంలో దాదాపుగా ఇదే జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ హయాంలో… సంక్షేమ పథకాలను టైమ్‌ టు టైమ్‌ ఇచ్చారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చేశారు. ఎక్కడో కాస్తో కూస్తో కింది స్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగుండొచ్చు… కానీ, ఓవరాల్‌గా… సామాన్య ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు జగన్‌. కోట్లాది రూపాయలను పేదల ఖాతాల్లో వేశారు. కానీ.. ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదు. పైగా… వైసీపీకి ఘోర ఓటమిని చవిచూపించారు. దీనికి కారణం ఏంటి..? అది… జగన్‌ నోటి నుంచే వచ్చింది. చేసింది చెప్పుకోలేకపోయామని ఆయనే ఒప్పుకున్నారు. ఇది నిజం.

Read also : శ్రీశైలం వెళ్తున్నారా.. అయితే ఇవి తప్పక పాటించాల్సిందే?

వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలే కాదు… అభివృద్ధి కూడా చేశాం. సంపద సృష్టించామని అన్నారు జగన్‌. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని చెప్పారాయన. తమ ప్రభుత్వలో ఏపీని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించామన్నారు. 1923 నుంచి 2019 వరకు ఏపీలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా.. అదనంగా ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారన్నారు. కానీ.. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చామని చెప్పారు. తాము తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీల్లో ఏడింటిలో క్లాసులు కూడా మొదలుపెట్టామన్నారు. ఈ కాలేజీలకు ఇచ్చిన భూములు, కట్టిన బిల్డింగ్‌ల విలువ బాగా పెరిగిందని.. లక్ష కోట్లకు చేరిందన్నారు. అంతేకాదు.. ఆ మెడికల్‌ కాలేజీల వల్ల లక్షలాది మంది ప్రాణాలకు భరోసా ఉంటుందన్నారు. ఇంత మంచి పనిచేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు జగన్‌. వైసీపీ హాయంలో ఆరోగ్యశ్రీని పకడ్బంధీగా నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలలకే చేతులెత్తేసిందని విమర్శించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 4వేల 500 కోట్లు బాకీ పెట్టి… వారు బోర్డులు తిప్పేసేలా చేశారన్నారు. కానీ తమ పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఆరోగ్య రంగంలో తాము చేసిన అభివృద్ధి, సంస్కరణలను ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు. తాము 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చిస్తే.. ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని… తమ వారికి దోచిపెట్టాలని చూస్తోంది. ఇది కూటమి ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఏది ఏమైనా… మెడికల్‌ కాలేజీలను తాము ప్రైవేట్‌పరం కానివ్వమని.. అడ్డుకుని తీరుతామన్నారు జగన్‌. అందుకోసం ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తామన్నారు. తాను కూడా నిరసనల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు.

Read also : నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తున్నాం : నారా లోకేష్

జగన్‌ తీరులో మార్పు వచ్చిందా…? నిజంగానే గత ఐదేళ్లలో జరిగిన తప్పు తెలుసుకున్నారా..? నష్టం జరిగినా తమ వాళ్లు ఇంకా గేర్‌ మార్చలేదన్నారు జగన్‌. ఇప్పటికైనా తమ టీమ్‌లో ప్రక్షాళన వైపు దృష్టి పెడతారా..? లేక మాటలకే పరిమితం అవుతారా…? ప్రచారంలో వెనకబడ్డామన్న రియలైజేషన్‌ జగన్‌లో కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఆ తప్పును ఎలా సరిచేసుకుంటారు…? ఆయన ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు…? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button