
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్, జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఒంగోలులో జరిగిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో మాధవ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్మి డబ్బులు దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా తీశారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి ఎక్కడ కార్యక్రమం జరుగుతున్న కూడా అరువు తెచ్చుకున్న జనాలతో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ శాంతిభద్రతలకు ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్నారని రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షులు మాధవ్, జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు.
Read also: పులివెందుల ఎమ్మెల్సీ పై దాడి.. వడ్డీతో సహా చెల్లిస్తాం : జగన్
నేనున్నానంటూ రైతులను పరామర్శించడానికి వెళ్లి.. పొగాకు మొత్తం నాశనం చేశారు. రైతులు నిర్నిత విస్తీర్ణం కంటే ఎక్కువ పొగాకు పండించడంతో… మార్కెట్ అనుకూలంగా లేదని మాధవ్ అన్నారు. అయినా రాష్ట్రానికి వెన్నుముక రైతు కాబట్టి… అలాంటి రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులందరూ కూడా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఒక పంట పైనే రైతులు ఆధారపడకూడదని తెలిపారు. కాలాను కనుగుణంగా పంటలను పండించాలని ఒంగోలులో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో రైతులకు సూచించారు మాధవ్. రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి కూడా శాంతి భద్రతలకు విగాథం కలిగించే అర్హత లేదని అన్నారు.
Read also : కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి? – ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తా!