
వైఎస్ జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడుస్తున్నారా..? అధినేత మాటను పెడచెవిన పెట్టి… ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారా..? ముందు మంచిగా ఉంటూ… వెనుక చేయాల్సిదంతా చేసేస్తున్నారా…? తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. బయటకు మాత్రం పార్టీ స్టాండ్‌కి, అధినేత మాటకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న నేతలు… ఓ విషయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో… జగన్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ… జగన్‌కు వెన్నుపోటు పొడుస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు..? ఏం చేశారు..?
Read More : టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం
చిన్నదైనా, పెద్దదైనా… వెన్నుపోటు.. వెన్నుపోటే. చిన్న చిన్న విషయాల్లోనే పార్టీ లైన్ దాటేవారు.. పెద్ద పెద్ద విషయాల్లో క్రమశిక్షణగా ఉంటారా..? అనేది అనుమానమే. ఇంతకీ ఏం జరిగిందంటే.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. సభలో ఉన్నది రెండే పక్షాలు అయినప్పుడు… ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వడంలో అభ్యంతరం ఏముందనేది ఆయన వాదన. దీని కోసం.. ముందు నుంచి పోరాడుతున్నారు జగన్. ఇందులో భాగంగా…. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకూ అవే ఆదేశాలు ఇచ్చారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు సభకు వెళ్లకూడదని దిశానిర్దేశం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలు.. తన మాట జవదాటరనే నమ్మకంతో ఉన్నారు జగన్. కానీ.. ఆ నమ్మకం ఇప్పుడు పటాపంచలైంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాదు కాదు… శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడే పట్టించారు.
విజయ్ సాయి రెడ్డికి తీరని కష్టాలు!… మరోసారి నోటీసులు ఇచ్చిన సీఐడీ
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు… దొంగల్లా వచ్చి శాసనసభ హాజరుపట్టీలో సంతకాలు పెట్టి వెళ్తున్నారని స్పీకర్ సభలో ప్రకటించారు. వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు దొంగల్లా వ్యవహరించడం సరికాదని.. అది వారి దిగజారుడుతనమని… వారి గౌరవాన్ని తగ్గిస్తుందని కాస్త ఘాటుగానే చెప్పారు. దొంగచాటుగా వచ్చివెళ్తున్న ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను కూడా సభలో చదివి వినిపించారు స్పీకర్. ఇలా.. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నారన్నాట. సభకు వెళ్లొద్దని చెప్పినా… వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వారి తీరు వల్ల పార్టీ పరువు పోయిందని ఫీలవుతున్నారట జగన్. అలా ఎందుకు చేశారనే దానిపై… ఏడుగురు ఎమ్మెల్యేల నుంచి సంజాయిషీ తీసుకోవాలని కూడా భావిస్తున్నారట.
ఇవి కూడా చదవండి ..
-
అసెంబ్లీ వేదికగా మందకృష్ణ మాదిగను ప్రశంసలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్!..
-
అమరావతిలో వివిధ కంపెనీలకు భూములు కేటాయింపులు…
-
పదవి వచ్చింది.. మరి బాధ్యతలో..! – ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎదురుచూపులు
-
2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?
-
ప్రక్షాళన జరిగితేనే వైసీపీకి లైఫ్ – తుక్కు ఏరకపోతే పార్టీ నిలబడటం కష్టమే..!