క్రీడలు

సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి నేటికి 12 ఏళ్లు..!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- క్రికెట్ దిగ్గజం, భారత క్రికెట్ అభిమానులకు దేవుడు అయినటువంటి సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి నేటికి 12 సంవత్సరాలు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు అనగా (2013 అక్టోబర్ 10) న సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. క్రికెట్ లో ఒక శకం ప్రతి ఒక్కరిని అలరించి… నేడు క్రికెట్కు ఇంతగా ఆదరణ వచ్చిందంటే అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఆడిన తీరు ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఒకవైపు రన్సుతో రికార్డులు బద్దలు కొడుతూ మరోవైపు ఆటతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా ఎంటర్టైన్ చేస్తూ భారత అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక 2013 నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడారు. నిజం చెప్పాలంటే… ” ఎన్నో రికార్డుల్లో సచిన్ పేరు ఉండడం కాదు… సచిన్ పేరు మీద ఎన్నో రికార్డులు ఉంటాయి”.. అది ఆయన సాధించిన ఘనత. ఇప్పటికి కూడా ఎంతోమంది భారత క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్ నాకంటే నాకు ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకుంటూ ఉన్న సందర్భాలు ఎన్నో చూసాము. ఒకప్పటి కాలంలో సచిన్ టెండూల్కర్ అంటే అది ఒక బ్రాండ్ గా చూసేవారు. తాజాగా లెజెండ్స్ లీగ్ లో కూడా సచిన్ టెండూల్కర్ అభిమానులు ఎంతగా అభిమానాన్ని చూపారో ఆ మ్యాచులలో స్పష్టంగా అర్థమైంది. నేడు సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్పెషల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ‘ఉయ్ మిస్ యు సచిన్ టెండూల్కర్ సార్’ అని కామెంట్లు చేస్తున్నారు.

Read also : నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న సీఎం… బీసీ అంశంపై క్లారిటీ వస్తుందా?

Read also : మ్యూజిక్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ దంచికొడుతున్నాడు… 39 బంతుల్లోనే సెంచరీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button