
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీ మరియు ఎమ్మెల్యే మధ్య వివాదం తారస్థాయిలో జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంపీ చిన్ని మరియు కొలికపూడి ఎమ్మెల్యే మధ్య వైరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వాలని సీఎం కోరగా తాజాగా ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. ఈ వివాదంలో తప్పంతా కూడా ఎమ్మెల్యే కొలికపూడిదే అంటూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయాయో అతను గెలిచినప్పటి నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అని పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక వ్యాఖ్యలను నివేదికలో వెల్లడించింది. అయితే తప్పంతా మీదే అని ఆరోపించిన కూడా తను ఎక్కడ కూడా ఒక ఆధారం సమర్పించలేదని సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ ఎమ్మెల్యే పై సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ విన్నవించినట్లుగా సమాచారం అందింది. అయితే మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరిని పిలిచి మరోసారి మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని పార్టీ క్రమశిక్షణ కమిటీకి చంద్రబాబు నాయుడు వివరించారు. మరి సీఎం ఈ ఎమ్మెల్యే పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read also : ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టు అయితే.. పాకిస్తాన్ కు కష్టమే!
Read also : మైనర్లు వాహనం నడిపిన, వారిని ప్రోత్సహించిన కట్టిన చర్యలు!





