Homeజాతీయంప‌సి పిల్ల‌ల ప్రాణాలు పోతుంటే ఊరుకోవ‌డం సిగ్గుచేటు...!మోదీ తీరుపై నారాయ‌ణ నిప్పులు...

ప‌సి పిల్ల‌ల ప్రాణాలు పోతుంటే ఊరుకోవ‌డం సిగ్గుచేటు…!మోదీ తీరుపై నారాయ‌ణ నిప్పులు…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: అమెరికా,ఇజ్రాయెల్ దేశాలు క‌లిసి ఇరాన్ పై దాడి చేస్తుంటూ మోడీ చూస్తు ఊరుకోవ‌డం సిగ్గుచేట‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ నిప్పులు చెరిగారు. ప్ర‌పంచంలోఓనే పెద్ద జ‌నాభ క‌లిగిన దేశం, అతిపెద్ద ప్ర‌జాస్వామ్యం క‌లిగిన దేశంగా ఉండి యుద్దంను ఆప‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ప్ర‌ధాని మోడీ ప్రపంచ ప‌ర్య‌న‌లు చేస్తుంటాడు కాని యుద్దంలో ప‌సి పిల్లల ప్రాణాలు కోల్పోవ‌డం ఇదేనా మ‌న విదేశాంగ విధాన‌మ‌ని ప్ర‌శ్నించారు.

భార‌త్ చేయాల్సిన ప‌నిని శ‌త్రుదేశం పాకిస్తాన్ చేస్తుంటే మ‌నం ఇంకా ఎందుకు మౌనంగా ఉండాల్సి వ‌స్తుంద‌ని నిల‌దీశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ప్రధాని ఒక అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకపోతే ఆ పర్యటనల అర్థమేంటన్నారు. గతంలో రష్యా, జర్మనీ, వియాత్నాం, క్యూబా, చైనా, ఇటలీ దేశాలకు వెళితే… సాధారణ ప్రజలు భారతీయులను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఇందిరా గాంధీని గుర్తు చేసుకునేవారు. అదే భారత్ గౌరవం, అదే భారత్ ప్రభావం అన్నారు. కష్ట కాలంలో సంధి కుదిర్చే ఒక గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు