
బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది…? కేసీఆర్ కుటుంబంలో కలహాలు.. పార్టీని దెబ్బతీస్తున్నాయా..? కేటీఆర్-హరీష్‌రావు స్ట్రాటజీ ఏంటి…? హరీష్‌రావుతో కేటీఆర్ భేటీ తర్వాత.. వ్యూహం మారిందా…? బావ-బామ్మర్ది మధ్య సయోధ్య కుదిరినట్టేనా…? వీరిద్దరూ కలిసిపోతే కవిత ప్లాన్ ఏంటి…? ఆమె అడుగులు ఎటు వైపు..?ఇంత జరుగుతున్నా… కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారా..? పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం ఎందుకు చేయడంలేదు..? గులాబీ పార్టీలో గందరగోళానికి చెక్ పడేదెన్నడు.
బీఆర్‌ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. రజతోత్సవ సభ తర్వాత.. విభేదాలు మరింత పెరిగాయి. కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్టు కేటీఆర్ వ్యవహరించడం… హరీష్‌రావుకు, కేటీఆర్‌కు మింగుడుపడటం లేదు. దీంతో… అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత మధ్య వార్ మరింత ముదిరింది. ఈ ఆధిపత్య పోరు గులాబీ పార్టీని ముక్కలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే కవిత.. బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. సొంత అజెండాతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇకపై మరింతగా దూకుడు పెంచె ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు హరీష్‌రావు కూడా… పార్టీలో ప్రాధాన్యతల విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. అయితే… ఇటీవల కుటుంబ సమేతంగా హరీష్‌రావు ఇంటికి వెళ్లి.. ఆయన్ను కలిసి వచ్చారు కేటీఆర్. దీంతో.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఆదేశాలతోనే కేటీఆర్, హరీష్‌రావు ఇంటికి వెళ్లి.. ఆయనతో చర్చలు జరిపినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో హరీష్‌రావు ఫొటో కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వర్గ ఎమ్మెల్యేలు కూడా మండిపడ్డారు. ఈ సమయంలో హరీష్‌రావుకు సర్దిచెప్పి.. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకే.. కేటీఆర్ హరీష్‌రావు ఇంటికి వెళ్లినట్టు సమచారాం. విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలని వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
కేసీఆర్.. చాలా కాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. రాజకీయ వారుసుడిని ప్రకటించి.. విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే… ప్రస్తుతం పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కేటీఆర్, హరీష్‌రావు, కవిత… మూడు ముక్కలాడ ఆడుతున్నారు. ఈ పరిస్థితి చక్కబడిన తర్వాత… వారుసుడిని ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. దీంతో… విధిలేని పరిస్థితుల్లో కేటీఆర్, హరీష్‌రావు ఇంటికి వెళ్లి.. ఆయనతో సయోధ్య కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్-హరీష్‌రావు సమస్యకు ఇప్పటికైనా చెక్ పడినట్టే అని అనిపిస్తోంది. ఇక.. కవిత.. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం ఆమె అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత.. కవితతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత.. ముగ్గురితోనూ చర్చించి.. ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.