
గట్టుప్పల,క్రైమ్ మిర్రర్ :- పంచాయతీ ఎన్నికల సందర్భంగా గట్టుప్పల్ మండల కేంద్రంలో గట్టుప్పల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు, వార్డ్ మెంబెర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహాక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. కొత్త మండల కేంద్రం గట్టుప్పల్లో అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా వుందన్నారు. నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లను గెలిపించుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. సర్పంచులను గెలిపించాల్సిన బాధ్యత మీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది అని అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమన్నారు.
Read also : వైరలవుతున్న తమన్నా, శ్రీలీలల బాత్రూం ఫోటోలు
Read also : Alto k10: ఇక మీరు కారు కొనాలనుకుంటే OLX అవసరం లేదండోయ్.. భారీగా ధర తగ్గించిన మారుతి





