
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావిస్తూ అందులో పని చేసేటటువంటి కార్మికుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులు పనిచేయకుండా ఉంటే జీతాలు ఎవరు ఇస్తారు?.. అని నిన్న జరిగినటువంటి CII సదస్సు కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ను ఒక తెల్ల ఏనుగుతో పోల్చారు. ఒక్కరు కూడా పనిచేయకుండా ముందుకు వెళుతుంటే ప్రతిసారి కేంద్రమే డబ్బులు ఎలా ఇస్తుంది.. కార్మికులు పనిచేస్తేనే కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది అని లేదంటే కేంద్రం డబ్బులు ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లలో భారీగా లాభాలు వస్తున్న క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం ఎందుకు లాభాలు రావడం లేదు అని ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని చంద్రబాబు అనడం చాలా దారుణమని తెలిపారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయంటూ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ విషయం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Read also : ఏందయ్యా ఇంత ఘోరమా.. టెస్టుల్లో అతి చెత్త రికార్డు మనదే!
Read also : Psychology facts: టెక్స్ట్ మెసేజెస్‌లో నిజం తక్కువ- అబద్ధం ఎక్కువ!





