Tuesday, February 24, 2026
Homeక్రైమ్ఆన్లైన్ లో విషం ఆర్డర్.. ఐటీ మహిళా ఉద్యోగి సూసైడ్

ఆన్లైన్ లో విషం ఆర్డర్.. ఐటీ మహిళా ఉద్యోగి సూసైడ్

హైదరాబాద్ మియాపూర్ లో విషాదం జరిగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఇందు కోసం ఆన్ లైన్ విషం ఆర్డర్ చేశాడు. ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. భర్త వేధింపులు,మనస్పర్థలు కారణంగానే ఐటీ ఉద్యోగిని నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మి కి వివాహం జరిగింది. అయితే కొన్ని రోజలుగా
తరచూ ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన నాగలక్ష్మి.. చావాలని నిర్ణయించుకుంది. గుగూల్ లో వెతికి ఆన్లైన్ లో విష పదార్థాలు ఆర్డర్ చేసుకుంది. గురువారం రాత్రి అన్నంలో కలుపుకుని తాగింది. ఉదయం ఆమె చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేశారు వివాహిత తల్లితండ్రులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments