
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య దాదాపు రెండు సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అయినా కూడా ఇరుదేశాలు యుద్ధాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గాజాలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. కేవలం ఒక్క గాజాలోనే మరణాల సంఖ్య 64000 దాటినట్లు తాజాగా అధికారులు రిపోర్టులు వెల్లడించారు. కేవలం నిన్న ఒక్కరోజులోనే ఇజ్రాయిల్ దాడుల్లో ఏకంగా 28 మంది మరణించారు. ఇందులో మరీ ముఖ్యంగా చిన్నారులు అలాగే మహిళలే అధికంగా ఉండడం తో ఆ దేశంలోని ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది.
Read also : పిఠాపురంలో మారనున్న పాలిటికల్ గేమ్.. పార్టీలో ప్రక్షాళనపై పవన్ ఫోకస్
ఇప్పటికే శాశ్వత కాల్పులు విరమణకు అంగీకరిస్తే మా దగ్గర ఉన్నటువంటి 48 మంది బంధీలను తక్షణమే విడుదల చేస్తామని హమాస్ ఒక ప్రతిపాదికను ఇజ్రాయిల్ ముందు పెట్టగా ఇజ్రాయిల్ దేశం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఏదైనా సరే యుద్ధం జరగాల్సిందే… యుద్ధంలో మిమ్మల్ని ఓడించడమే మా లక్ష్యం అంటూ.. ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. దాదాపు 2023 వ సంవత్సరం నుంచి ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ రెండు దేశాలలోని పలు ముఖ్య నగరాలు ధ్వంసం అయ్యాయి. ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కేవలం ఆకలి కారణంగానే చనిపోయిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఇజ్రాయిల్ ఓ ఆసుపత్రి పై దాడి చేయగా అందులో ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది చర్చించారు. ఈ దాడుల పట్ల అసలు సంతృప్తిగా లేనంటూ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని కూడా తుర్కియే దేశం బదులిచ్చింది.
Read also : కొత్త జీఎస్టీతో డబుల్ స్పీడ్ అభివృద్ది- ప్రధానిమోడీ