
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- మన భారతదేశం ఎంతలా అభివృద్ధి చెందిందంటే కొన్ని ప్రత్యేక సంఘటనల ద్వారా అర్థం అయిపోతుంది. మన భారత పవర్ అంటే ఏంటో.. మన దేశానికి కొన్ని ఇతర దేశాలకు మధ్య ఉన్న సంబంధాలు ఎటువంటివో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే… మన భారతీయ పర్యాటకుడు ఒకతను ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు బయలుదేరాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎంట్రన్స్ లో ఒక సాధారణమైన చెక్ పోస్ట్ వద్ద తాలిబాన్ భద్రత సిబ్బంది మన భారతీయ పర్యాటకుడిని ఆపాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివి అని ప్రశ్నించగా.. మన భారతీయ పర్యాటకుడు వెంటనే ఇండియా అని అంటాడు. ఇండియా అని చెప్పగానే తాలిబాన్ భద్రత సిబ్బంది వెంటనే నవ్వుతూ అవునా ఓకే పర్లేదు వెళ్ళండి బ్రదర్ అంటూ పాస్పోర్ట్ అలాగే ఇటువంటి పత్రాలు కూడా తనిఖీ చేయకుండా లోపలికి అనుమతించారు. ఇది చూస్తున్న సోషల్ మీడియా నేటిజన్స్ చాలా సంబరపడిపోతున్నారు. ఇది భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఉన్న బంధం అంటూ నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతీయులపై ఇతర దేశాలకు చాలా నమ్మకం ఉందంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్తో దీర్ఘకాల సంబంధాల ప్రతి చర్యగా అభివర్ణిస్తూ దీనికి ఉదాహరణంగా ఈ వీడియో అని చెప్పవచ్చు.
Read also : దర్శక దీరుడి జన్మదినం నేడు… ప్రతి సినిమా బ్లాక్ బస్టర్
Read also : <a style="color:red" href=”https://crimemirror.com/its-been-12-years-since-sachin-announced-his-retirement/”>సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి నేటికి 12 ఏళ్లు..!