
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టి20 లో భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇక సెంచరీ చేసిన తర్వాతి బంతిలో న్యూజిలాండ్ బౌలర్ డఫి బౌలింగ్లో అవుటయి పెవిలియనుకు చేరారు.ఈ ఆఖరి టి20 మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లందరూ కూడా విజృంభించి ఆడారు. సంజు సాంసంగ్ తప్ప మినహా బ్యాట్స్మెన్ లందరూ కూడా ఫుల్ ఫైర్ మీద ఆడారు. అభిషేక్ శర్మ 30, ఇషాన్ కిషన్ 103, సూర్య కుమార్ యాదవ్ 63, హార్దిక్ పాండ్యా 42 పరుగులు చేసి ఔటయ్యారు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్నిత 20 ఓవర్లకు 271 పరుగులు చేయగా 272 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లకు 225 పరుగులకె ఆల్ ఔట్ అయింది. దీంతో 46 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ కు మరొక వారం రోజులు ముందుగానే భారత్ t20 లో అబ్దుతమైన ప్రదర్శన కనబరుస్తున్న తీరు చూస్తుంటే వరల్డ్ కప్ కూడా టీమిండియా వశం అవుతుంది అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read also : క్రైమ్ మిర్రర్ దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్ఐ కోటేష్
Read also : క్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి





