
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 కు సంబంధించి మినీ ఆక్షన్ కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. డిసెంబర్ 16వ తేదీన అబుదాబిలో ఈ ఐపీఎల్ 2026 కు సంబంధించి మినీ వేలం జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్లు కూడా తమ ప్లేయర్లను అంటి పెట్టుకోవడమే కాకుండా జట్టులో వేస్ట్ అనిపించిన ప్లేయర్స్ అందరినీ కూడా విడుదల చేశాయి. ఇక ఇదే పద్ధతిలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీలాంటి కీలక ప్లేయర్ ను వదులుకుంది. ఎందుకంటే 2025లో షమీ చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయాడు. బహుశా అందుకేనేమో ఆ జుట్టు ఓనర్ కావ్య మారన్ అతన్ని వదిలి వేసి మరో స్టార్ బౌలర్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ బౌలర్ పై కన్ను వేసింది.
Read also : వైయస్ జగన్మోహన్ రెడ్డి ది దుర్మార్గపు పాలన : కొల్లు రవీంద్ర
ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద 25.50 కోట్లు రూపాయలు ఉన్నాయి. కనిష్టంగా మంచి ప్లేయర్లను తీసుకుంటే మాత్రం ముగ్గురు ప్లేయర్ల వరకు తీసుకోవచ్చు. అదే తక్కువ ప్రతిభ గల ప్లేయర్ల కోసమైతే ఏకంగా పదిమందిని తీసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాదు జట్టుకు ఫాస్ట్ బౌలర్ కావాలి. మహమ్మద్ షమీ స్థానాన్ని ఒక శ్రీలంక ఫాస్ట్ బౌలర్ తో భర్తీ చేసుకోవాలని కావ్య మారని ప్లాన్ చేసినట్లు సమాచారం. అతను మరువరో కాదు.. గత రెండు మూడు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నటువంటి శ్రీలంక స్టార్ బౌలర్ మతిషా పతిరాన. ఈ స్టార్ బౌలర్ ను ఎలాగైనా కొనుగోలు చేయాలని కావ్య మారన్ పట్టుబడినట్లుగా సమాచారం. దీంతో కచ్చితంగా ఈ నెల 16వ తేదీన జరగబోయేటువంటి మినీ వేలంలో ఈ ప్లేయర్ పై కాసులు వర్షం కురవాల్సిందే. చాలా అద్భుతమైన యార్కర్లు వేసేటువంటి ఈ బౌలర్ పతిరాన కోసం హైదరాబాద్ జట్టు తన పర్సులో సగం శాతం ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read also : వైయస్ జగన్మోహన్ రెడ్డి ది దుర్మార్గపు పాలన : కొల్లు రవీంద్ర





