
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మూడవ టెస్టు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరగగా… ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలు కావడంతో పాటు మరో చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఎందుకంటే 2013 నుంచి టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లో 150 కి పైగా టార్గెట్ ను టీమిండియా కేవలం రెండుసార్లు మాత్రమే చేదించడం జరిగింది. ఇక మొత్తంగా 26 మ్యాచుల్లో 17 మ్యాచులు ఓడిపోగా ఏడు మ్యాచ్లు డ్రా గా ముగిశాయి. ఇక 2021 బ్రిస్ బేన్ వేదికగా ఆస్ట్రేలియాపై అలాగే 2024వ సంవత్సరంలో రాంఛీలో ఇంగ్లాండ్ పై మాత్రమే ఇండియా 150 పైగా టార్గెట్ ను సులభంగా చేజ్ చేసి విజయం సాధించింది.
ఇక ఈ జాబితాలో మొత్తంగా పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ కంటే భారత్ వెనకబడి ఎనిమిదవ స్థానంలో ఉండడం మరొక రికార్డు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు ముగిసిపోగా రెండు మ్యాచ్లు ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. దీంతో తర్వాత జరగబోయే టెస్ట్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని… లేకపోతే టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా స్ఫూర్తిని కోల్పోతుందని చాలామంది క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లేకపోవడం టెస్ట్ మ్యాచ్ పై తీవ్రంగా ప్రభావితం చూపిస్తుందని.. కోహ్లీ మరియు రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ నేత మిథున్‌రెడ్డికి లుక్ అవుట్ నోటీసులు
విద్యార్థినిపై అధ్యాపకుల గ్యాంగ్ రేప్, బీఈడీ స్టూడెంట్ ఆత్మాహుతి!