
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. తాజాగా వైసిపి పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ ఎందుకు వేటు వేసిందో చాలానే కారణాలు ఉన్నాయి. దువ్వాడ సస్పెన్షన్ గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తున్న విషయమే. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని మొదటగా సస్పెన్షన్ ప్రకటనలో పేర్కొన్న కూడా… బయట అది సరైన కారణం కాదని చాలా ఆరోపణలు ఉన్నాయి. దువ్వాడ తన ప్రేయసి తో కలిసి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఈ ఎఫెక్ట్ అంతా కూడా పార్టీ పైన పడింది. అయితే దువ్వాడ నువ్వు సస్పెండ్ చేయడం వెనుక ఒక పెద్ద కారణం ఉందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రెండింగ్ లో నిలిచారు. అయితే ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా సమర్థవంతమైన నాయకులంటూ దువ్వాడ జంట ప్రశంసలు కురిపించారు. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆ విషయాన్ని ఈ పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ అలాగే మాధురి ఇద్దరు కూడా కలిసిమెలిసి తిరగడమే కాకుండా సంయుక్తంగా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గానికి అలాగే రాజకీయపరంగా కూడా దూరంగా ఉండటంతో దువ్వాడ పై వేటు వేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడానికి గల కారణం ఒక మిస్టరీ గానే మారిపోయింది.
పర్మిషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్న కంపెనీ పై చర్యలు తీసుకోండి :పంది పెంటయ్య