
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-సాధారణంగా మన భారతదేశంలో 60 సంవత్సరాల ఉన్న వ్యక్తిని కచ్చితంగా ముసలి వారి కిందగా భావిస్తారు. కానీ 66 సంవత్సరాలు ఉన్న హీరో నాగార్జున మాత్రం తన గ్లామర్ మరియు ఫిట్నెస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మన పల్లెటూర్లలో ఇదే 66 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒక ముసలి వారిగా కనపడతారు. కానీ కొంతమంది నటులు మాత్రం 70 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడి లా కనిపిస్తున్నారు. ఇక తాజాగా 66 ఏళ్ల వయసులో కూడా హీరో నాగార్జున ఇంత గ్లామర్ మరియు ఫిట్నెస్ తో ఉండడానికి గల కారణాన్ని వివరించారు. డైటింగ్ కంటే టైం కు ఫుడ్ తీసుకోవడం వలనే ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమని తన రహస్యాన్ని తెలిపారు. దాదాపు 45 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా జిమ్ మిస్ అవ్వలేదు అని అన్నారు. దాంతోపాటుగా పాజిటివ్ థింకింగ్ అలాగే మెంటల్ హెల్త్ కూడా ఈ సీక్రెట్ లో ఒక కీలక భాగమని ప్రకటించారు. కాబట్టి ప్రతిరోజు పాజిటివ్ థింకింగ్, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు జిమ్ చేయడం వలనే ఈరోజు నేను ఇంత గ్లామర్ గా అలాగే ఎంగ్ గా కనిపిస్తున్నాను అని అన్నారు. అయితే 2025 సంవత్సరము అనేది తనకు వ్యక్తిగతంగానూ అలాగే కెరీర్ పరంగాను చాలా సంతృప్తిని ఇచ్చింది అని నాగార్జున పేర్కొన్నారు. ఎట్టకేలకు తన గ్లామర్ మరియు ఫిట్నెస్కు గల కారణాలను నాగార్జున తెలపడంతో ఇవన్నీ ప్రతి ఒక్కరూ సాధారణంగా ప్రతిరోజు చేసేవే కదా అని.. కాకపోతే మనమే నాగార్జున ఫిట్నెస్ మరియు గ్లామర్ గురించి ఎక్కువ ఆలోచించాము అని తలలు పట్టుకుంటున్నారు.
Read also : ఈరోజే అన్ని వదిలేసేయ్.. GOOD BYE 2025
Read also : వేములపల్లి పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్… 15 మందిపై కేసు నమోదు





