HomeజాతీయంLok SabhaVideo: ఫిబ్రవరి 4న లోక్ సభలో ఏం జరిగింది? షాకింగ్ వీడియో రిలీజ్!

Lok SabhaVideo: ఫిబ్రవరి 4న లోక్ సభలో ఏం జరిగింది? షాకింగ్ వీడియో రిలీజ్!

Rijiju Shares Video of Opposition MPs in Lok Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ఈ నెల 4న ప్రధాని మోదీ మాట్లాడాల్సి ఉండగా.. ఆయన సభకు రాకముందే విపక్ష మహిళా ఎంపీలు ఆయన కుర్చీని చుట్టుముట్టడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు తాజాగా రెండు వీడియోలను విడుదల చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపామని, మోడీపై చెయ్యెత్తే ఉద్దేశం తమకు లేదంటూ వారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ఇదేనా మీ శాంతియుత నిరసన?    

ఈ నేపథ్యంలో వారి శాంతియుత నిరసన ఇదేనంటూ రిజిజు ఆ వీడియోలను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. బ్యానర్‌ పట్టుకుని ఆ మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ చుట్టూ చేరడం.. కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, మరికొందరు ఎంపీలు వారిని వెనక్కి వెళ్లాలని కోరడం వాటిలో కనబడుతోంది. ‘తమ ఎంపీల దిగజారుడు ప్రవర్తనకు కాంగ్రెస్‌ ఎంతగానో గర్వపడుతోంది. మా ఎంపీలందరినీ గనుక మేం అడ్డుకుని ఉండకపోతే.. ప్రధాని కుర్చీని చుట్టుముట్టిన విపక్ష ఎంపీలను ఎదుర్కొనేందుకు మా మహిళా ఎంపీలను అనుమతించి ఉంటే.. సభలో చాలా దారుణ దృశ్యానికి దారితీసేది. పార్లమెంటు హుందాతనాన్ని కాపాడాలని.. దుందుడుకుగా వ్యవహరిస్తున్న విపక్ష ఎంపీలతో భౌతిక ఘర్షణకు బీజేపీ ఎంపీలు దిగరాదని మా నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి’ అని రిజిజు వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments