Uncategorized

తెలంగాణలో టీడీపీ బలపడే ఛాన్స్‌ ఉందా.. రేవంత్‌రెడ్డి ఏం చెప్పారంటే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా..? బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ ఛాన్స్‌ దక్కలేదు. మరి రేవంత్‌రెడ్డి హయాంలో అవకాశం వస్తుందా..? టీడీపీపై రేవంత్‌రెడ్డి అభిప్రాయం విన్న వారంతా… తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలపడేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టే అని అంటున్నారు. ఇందులో నిజమెంత…? అసలు టీడీపీ గురించి రేవంత్‌రెడ్డి ఏమన్నారు..? తెలుగుదేశం పార్టీ… రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మాత్రమే పరిమితమైంది. అది ఆంధ్రా పార్టీ అని ముద్రపడిపోయింది. దీంతో.. తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులను ఎదగనివ్వలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ… 2023 ఎన్నికలకు దూరంగా ఉంది. అంతేకాదు.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన కూడా చేసే సాహసం చేయలేకపోయారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అంటే… బీఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు.. తెలంగాణలో టీడీపీ ఆటలు సాగలేదు. గతంలో కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు అధినేత చంద్రబాబు. అయితే.. 2023 ఎన్నికల తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి. అయితే.. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు శుభసంకేతాలు వచ్చాయని అంటున్నారు. ఇంతకీ రేవంత్‌రెడ్డి ఏమన్నారు..?

Read also : కల్వకుంట్ల కాదు దేవనపల్లి.. కవిత ఇంటిపేరు మార్చేసిన బీఆర్‌ఎస్‌..!

తెలంగాణలో టీడీపీని ఎదగనివ్వకుండా చేశారని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అని… చాలా మందికి అవకాశం కల్పించిందని అన్నారు ముఖ్యమంత్రి. కానీ.. కొంత మంది కుట్రల వల్ల ఆ పార్టీ తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుందోని చెప్పారు. ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసిన వాళ్లు ఎలా మనుగడ సాగిస్తారని.. అందుకే ప్రకృతి వారిని శిక్షిస్తుందోని బీఆర్‌ఎస్‌ ఉద్దేశించి విమర్శలు చేశారు. అంటే సీఎం రేవంత్‌రెడ్డి టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఆ పార్టీని ఎదగనివ్వకుండా చేసిందన్నారు. అంటే… కాంగ్రెస్‌ హయాంలో టీడీపీ బలపడవచ్చని.. తాము అడ్డుకోబోమనే సంకేతాలు ఇచ్చినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలోని టీడీపీ క్యాడర్‌ మాత్రం… రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డిని చంద్రబాబు శిష్యుడని అంటారు అందరూ. అంటే… గురువుకు రాష్ట్రంలో లైన్‌క్లియర్‌ చేస్తున్నారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా.. ఇక్కడ టీడీపీని విస్తరించేందుకు చంద్రబాబుకు ఇదో మంచి అవకాశం. మరి తెలంగాణ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చర్యలు తీసుకుంటారా..? అనేది చూడాలి.

Read also : లండన్‌లో హరీష్‌రావు చిట్‌చాట్.. మన పార్టీకి కేసీఆర్‌ గారే సుప్రీం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button