
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో నుంచి మరొక అమ్మాయి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు అయినటువంటి జాన్వీస్వరూప్ త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏం చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు… మా బాబు మేనకోడలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ జాన్వి స్వరూప్ అనే ఈ హీరోయిన్ గతంలో ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కేవలం సినిమాల్లో నటించాలని కోరికతోనే ఆమె ఇప్పటికే డాన్స్, ఫిట్నెస్ మరియు డ్రైవింగ్ వంటి కొన్ని అంశాల్లో పూర్తిగా శిక్షణ తీసుకున్నట్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా తన ముద్రను వేసుకున్నారు. తాజగా రాజమౌళితో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. రాజమౌళితో తీసేటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అవడం కూడా ఖాయమని ఇప్పటికే ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ బాబు మేనకోడలు హీరోయిన్ గా ఎలాంటి ముద్ర వేసుకుంటారో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Read also : శాంతించిన మొంథా తుఫాను.. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు
Read also : వరద ముప్పులో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాల





