Homeజాతీయం“పువ్వు బాగుందా? ఏం మాట్లాడుతున్నావ్?”.. అభిమానిపై కీర్తి సురేష్ ఫైర్ (VIDEO)

“పువ్వు బాగుందా? ఏం మాట్లాడుతున్నావ్?”.. అభిమానిపై కీర్తి సురేష్ ఫైర్ (VIDEO)

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నేను శైలజ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ అగ్ర కథానాయికల సరసన నిలిచారు. సహజమైన నటన, మృదువైన అభినయం, పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయే తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

నాని తో నేను లోకల్, పవన్ కల్యాణ్ తో అజ్ఞాతవాసి, మహానటి, మన్మథుడు 2, జాతి రత్నాలు, రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా, కల్కి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో ఆమె కనబరిచిన నటన ప్రశంసల వర్షం కురిపించింది. ఆ చిత్రంలో ఆమె జీవించిన తీరు చూసి సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. ఆ పాత్రకు గాను జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఆమె కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇటీవల రివాల్వర్ రీటా, ఉప్పుకప్పురంబు చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్న సందర్భంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవార్డు స్వీకరించేందుకు వెళ్తున్న సమయంలో చెన్నై నగరంలో ఆమె కారు ఎక్కుతుండగా ఓ అభిమాని చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. తలలో పువ్వు పెట్టుకున్న ఆమెను ఉద్దేశించి ఆ అభిమాని “మీ పువ్వు చాలా బాగుంది” అని అన్నాడు. ఆ వ్యాఖ్య విన్న కీర్తి సురేష్ కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక క్షణం తేరుకుని “పువ్వు బాగుందా? ఏం మాట్లాడుతున్నావ్?” అంటూ సరదాగా స్పందించారు.

తన అందాన్ని మెచ్చుకోవాల్సింది పోయి పువ్వును ప్రశంసించడం ఏమిటని నవ్వుతూ కారు లోపలికి వెళ్లారు. అనంతరం తన మాతృభాష తమిళంలో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యపై సరదాగా స్పందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానితో జరిగిన ఆ చిన్న సంఘటననే నెటిజన్లు పెద్ద చర్చగా మలిచారు.

గతంలోనూ ఇలాంటి అనుభవమే ఆమెకు ఎదురైంది. ఒక అభిమాని ఫోటో కోసం అభ్యర్థించగా ఆమె సంతోషంగా అంగీకరించారు. అయితే ఆ అభిమాని ఫోన్ కెమెరా పైకి పెట్టడంతో తన జాకెట్ ను కవర్ చేసుకుంటూ.. క్రిందకు దించి ఫోటో తీసుకోమని అభిమానితో అన్నారు. ఆ వీడియో కూడా అప్పట్లో విస్తృతంగా వైరల్ అయింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళం, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు.

ALSO READ: Gas problem: మందులు లేకుండా గ్యాస్ కంట్రోల్.. ఎలాగంటే?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు