క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యానికి గురై తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ప్రతిరోజు కుటుంబ పోషణకై లేదా వ్యక్తిగత అవసరాలకై ప్రతి మనిషి ఏదో ఒక జీవనోపాధి వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. “మానసిక ఒత్తిడే మనిషికి మొదటి శత్రువు” అని పేర్కొన్నారు. మనం ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతామో అప్పుడు మెదడులోని నాడి వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది అని.. ఇలా నాడి వ్యవస్థ వేగంగా స్పందించడం వల్ల బీపీ మరియు హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచుకుపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు కూడా దారితీస్తుంది అని సంచలన నిజాలను తెలిపారు.
కాబట్టి ప్రతి మనిషి ఒత్తిడికి గురైనప్పుడు ప్రశాంతత కోసం అలాగే ఆరోగ్యం కోసం మంచి యోగా అలాగే ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ఒత్తిడి నుంచి తగ్గించుకోవచ్చు అని సూచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడికి గురవ్వకండి. మానసిక ఒత్తిడి వల్ల ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది అని చెబుతున్నారు. ఒక్కో సమయంలో అది ప్రాణాలకు కూడా ముప్పే అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఒత్తిడే మనిషి ఆరోగ్యానికి మొదటి శత్రువు అని.. ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వైద్యులు చెబుతున్నారు. ఏదో ఒక సమస్య లేదా ఏదో ఒక సంఘటన ద్వారా ఒత్తిడికి గురవుతే వెంటనే యోగా చేయడం లేదా ధ్యానం చేయడం లేదా పాటలు వింటుండడం వంటివి చేయడం వల్ల కాస్తయినా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది అని డాక్టర్లు సూచిస్తున్నారు.
క్యాతనపల్లిలో 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు.. రెండు రోజులపాటు గుంపుల నిషేధం,ర్యాలీలకు బ్రేక్
