
క్రైమ్ మిర్రర్ న్యూస్ :- జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతుంది. పాకిస్తాన్ కు నష్టం కలిగించేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా సింధు నది జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కు మరింత ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కనుక ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఉంటూ పోతే… ఈ ఒప్పందాన్ని అమలు చేసేదే లేదని భారతదేశం వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ కు భారీగానే నష్టం కలగవచ్చని చెప్పాలి. ఎందుకు అంటే పాకిస్తాన్లో 90 శాతం మంది భూమి సాగు చేయడం కోసం ఈ సింధూ నది జలాలని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సింధూ నది నీటి పైనే పాకిస్తాన్ దేశం ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ పాకిస్తాన్ లో ప్రవహించే సింధూ నదుల నీటిని భారత్ ఆపేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు తీవ్ర సంక్షోభం ఏర్పడవచ్చు. అలాగే తాగునీటికి కూడా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సిందే. పాకిస్తాన్లోని విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ ను ఆర్థికంగా మరింత దిగజార్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్లో ప్రవహించే జీలం , చీనాబ్, సింధు నదుల నీటిని భారతదేశం ఆపడానికి ఎంత సమయం పడుతుందో?… అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన దేశం నుంచి పాకిస్థాన్లోకి ప్రవహించే ఈ మూడు నదులను పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుకోవడం అంటే అంత సులువు ఏమి కాదు. నీటిని ఒక రాత్రిలో పాకిస్తాన్ కు చేరకుండా ఆపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలనేవి మన భారతదేశంలో పెద్దగా లేవు. ఒకవేళ భారత్ డ్యాములు కనుక నిర్మిస్తే మాత్రం మనదేశంలోని జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రంగా వరదలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పక్కాగా ఏదో ఒక ప్లాన్ చేస్తే కానీ పాకిస్థాన్లోకి ఈ నదులను అడ్డుకోవడం కాస్త కష్టమే. కానీ ఇక్కడ ఉంది భారతదేశము కాబట్టి భారత్కు ఏదైనా సాధ్యమే. దాదాపు 30 మంది అమాయకుల ప్రాణాలను బలిగున్న నేపథ్యంలోనే భారత్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులను కొంతవరకు భారత ఆర్మీ స్థాపితం చేసింది.