
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మోసగాళ్లు వినూతన పద్ధతిలో డబ్బులను కాజేయాలని చూస్తున్నారు. తాజాగా జరిగిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జనార్ డీపీ పెట్టుకొని మరీ మోసాలు చేస్తున్నటువంటి ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ లాంటి వారి ఫోటో పెట్టుకొని మరి మోసాలు చేస్తున్నారంటే వారికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా దీనిపై స్పందించిన పోలీసులు ఇలాంటి ఫేక్ డీపీలు పెట్టుకొని మెసేజ్ లను నమ్మవద్దు అని వారికి స్పందించి మోసపోవద్దని సూచించారు.
Read also : సెంచరీ తో విరుచుకుపడ్డ రోహిత్.. ICC వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం?
పోలీస్ ఆఫీసర్ పేర్లతో ఏవైనా మెసేజ్ లు వస్తే దాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించి నేరుగా వెళ్లి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి కానీ.. ఇలా ఆన్లైన్ లోనే ఆ సమస్యలను తీర్చుకోవాలి అంటే అది మోసం కిందకే వస్తుంది అని హెచ్చరించారు. సైబర్ నేరగాలకు ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని… ఒకవేళ డబ్బులు అడిగితే కచ్చితంగా వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లకు ఈమధ్య మోసాలు చాలా సులభం అయ్యాయని… కొత్త కొత్త పద్ధతులతో చాలా అప్డేటెడ్ గా ఉన్నారు అని తెలిపారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఎవరూ కూడా ఎటువంటి విషయంలో స్పందించవద్దు అని… ఒకవేళ మీరు మోసానికి గురవుతున్నారు లేదా మోసానికి ఇంతకుముందు గురయ్యారు అని అర్థమైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలని తెలిపారు. మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ పేరిట కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి తద్వారా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.
Read also : ప్రస్తుతం పాత్రధారులు అరెస్టు అవుతున్నారు… త్వరలోనే జగన్ కూడా : మంత్రి సత్య కుమార్





