
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆసియా కప్ 2025 లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. దాయాదుల మధ్య ఆదివారం మూడవసారి మ్యాచ్ జరుగునుంది. ఆసియా కప్ సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగనుంది. టోర్నీలో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ మరియు భారత్ మధ్య రెండుసార్లు మ్యాచ్ జరిగింది. రెండింటిలోనూ భారత్ ఘన విజయం సాధించింది. అలాగే ఇరుదేశాల మధ్య వివాదాలు కూడా తలెత్తుకున్న సందర్భాలు చూశాం. అయితే రేపు ఆదివారం జరగబోయే మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్.. పాకిస్తాన్ ప్లేయర్లను మైదానంలోనే అవమానించింది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ ను ఎలాగైనా ఓడించాలని చూస్తుంటే.. మరోవైపు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే కప్పు గెలవచ్చని తహతహలాడుతుంది.
Read also : వరల్డ్ నెంబర్ వన్ సైకో అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ” విధి ” కూడా పాకిస్తాన్ ను అవమానించేలా ఫైనల్ మ్యాచ్ ను భారత్ తో ఏర్పాటు చేసిందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మరియు భారత్ మధ్య చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాములో జరిపిన ఉగ్ర దాడి తర్వాత భారత దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ దేశంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇదే ఆగ్రహంతో మన భారత క్రికెటర్స్ పాకిస్తాన్ పై రెండు మ్యాచ్ లలో విజయం సాధించడంతోపాటుగా అవమానించారు. దీంతో అభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు. భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా విధి కూడా సహకరించేలా కనిపిస్తుంది అంటూ.. అందుకే విధియాడిన వింత నాటకంలో పాకిస్తాన్ నిన్న తక్కువ పరుగులే నమోదు చేసిన చివరికి పాకిస్తాన్ గెలిచింది. భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి విధియాడిన ఇది ఒక వింత నాటకం అంటూ భారత ఫ్యాన్స్ పాకిస్థాన్ ను ఎద్దేవా చేస్తున్నారు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి.
Read also : ముసలాయన కాదు.. నవ యువకుడు అంటున్న జనం!