
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా కథ ప్రేక్షకులకు నచ్చితే అది ఎంతటి కలెక్షన్ల వర్షాలు కురిపిస్తుంది అనేది ఇప్పటికే ఎన్నో సినిమా రిలీజ్ అయిన సందర్భాలలో చూస్తున్నాము. ఇప్పుడున్న డైరెక్టర్లలో ఒక నాలుగు ఐదు సినిమాలు తీస్తే అందులో ఒకటి లేదా రెండు సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అందరి దర్శకులందు అనిల్ రావిపూడి కచ్చితంగా వేరే. ఎందుకంటే అతను ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క సినిమాను పూర్తి చేసుకుంటూ ఆ సినిమా సూపర్ హిట్ చేసుకుంటూ వస్తున్నారు అనిల్ రావిపూడి. గత ఏడాది ఇదే సంక్రాంతి రోజున “సంక్రాంతికి వస్తున్నాం” అనే సినిమాతో ఒకవైపు హీరో వెంకటేష్ కు అలాగే అభిమానులకు మంచి బ్లాక్ బస్టర్ సినిమాను అందించారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ” మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమాతో మరో రికార్డ్ సృష్టించారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. వరస సంవత్సరాలలో 200 కోట్లకు పైగా కలెక్షన్లను సృష్టించేటువంటి మూవీలను అందించిన తొలి టాలీవుడ్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి రికార్డులు తిరగ రాశారు. ఇక ఈరోజుకి ఈ సినిమా ఏకంగా 292 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో రాజమౌళి సరసన అనిల్ రావిపూడి చేరారు.
Read also : టీ షర్టుతో.. న్యూలుక్ లో.. స్పీచ్ తో అదరగొట్టిన లోకేష్
Read also : ఉమెన్స్ ఐపీఎల్ లో RCB రికార్డు..?





