
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- టిడిపి కి సపోర్ట్ చేస్తున్నటువంటి సీమ రాజా మరియు కిరాక్ ఆర్పి లపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సిపి పార్టీ మీద అలాగే పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ… పార్టీకి నష్టం చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని.. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొన్నారు. ఇవాళ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు సోషల్ మీడియాలో వైసీపీ పార్టీపై, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై, నాపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. అలాగే ఐ టీడీపీ పై కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. మరి ముఖ్యంగా వైయస్సార్సీపి కండువ కప్పుకొని పార్టీని దిగజార్చుతున్న సీమ రాజా అనే వ్యక్తిపై, మరోవైపు మాజీ మంత్రి రోజా అలాగే కొంతమంది ఈ వైసీపీ నాయకులపై చెడుగా వీడియోలు చేస్తున్న కిర్రాక్ ఆర్పి పై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన అనంతరం మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌లో టీడీపీ హస్తం – బాంబ్ పేల్చిన కేశినేని నాని
గతంలోనూ వైసీపీ పార్టీకి నష్టం చేసినటువంటి వ్యక్తుల పై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏ విధంగానూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అందుకే ఈసారి ఫిర్యాదు చేసినటువంటి రసీదు తీసుకున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థ అనేది టిడిపి గుప్పెట్లో ఉందని… పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు మాత్రం తీసుకోకపోతే కచ్చితంగా కోర్టులకు వెళ్తామని వ్యాఖ్యానించారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తామని హెచ్చరించారు. వైసీపీ పార్టీ ఇన్ పర్సన్ గా నా ఆవేదనను నేను స్వయంగా ప్రతి ఒక్కరికి వినిపిస్తాను అని… అన్నారు. సీమ రాజా మరియు కిరాక్ ఆర్పి ల లాంటి వాళ్లను చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు అని… ఎంత పెద్ద వారైనా కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు.
ఇవి కూడా చదవండి …
-
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?
-
ఏకకాలంలో ప్రేమాయణం.. ఒకే మండపంలో పెళ్లి..
-
హస్తం పార్టీలో చెంపదెబ్బలు – ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ
-
ఉగ్రదాడి ఎఫెక్ట్- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..!
-
ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.