
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు జరగగా మొదటి టీ20 మ్యాచ్ లో భారత్, రెండవ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచి సరి సమానంగా ఉన్నాయి. అయితే ఈ రెండు మ్యాచ్లలోనూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరియు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఇద్దరు కూడా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. గత 14 t20 మ్యాచ్లలో గిల్ 263, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 20 మ్యాచ్లాడి 227 పురుగులు మాత్రమే కొట్టారు అని ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వీళ్ళ కోసం ఫామ్ లో ఉన్నటువంటి శాంసన్ మరియు జేష్వాల్ బలవుతున్నారు అని నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : జపాన్ ను భయానికి గురిచేస్తున్న వరుస భూకంపాలు?
వెంటనే వీరిద్దరినీ టీం నుంచి తొలగించి సాంసన్ మరియు జైస్వాల్ కు అవకాశాలు కల్పించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. జైస్వాల్ ఈమధ్య ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలోను గిల్ 4,0 పరుగులకే అవుట్ అవ్వగా.. సూర్య కుమార్ యాదవ్ కూడా అంతగా రాణించలేదు. వీళ్ళిద్దరిని ఆడించి సాంసన్ మరియు జైష్వాల్ కే కాకుండా.. భారత జట్టుకు కూడా అన్యాయం చేస్తున్నారు అని సెలెక్టర్ల పై మండిపడుతున్నారు. దీంతో 2026 t20 వరల్డ్ కప్పులో ఈ ఆటగాళ్లతో మన భారత జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందా అని నిరాశ చెందుతున్నారు.
Read also : Mass Warning: ఒక్కొక్కడి తోలు తీస్తా: కవిత





