Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంమిసైల్స్ తో ఇరాన్ అటాక్స్.. ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్!

మిసైల్స్ తో ఇరాన్ అటాక్స్.. ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్!

Iran Hits Israeli Sites: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇరాన్ కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ లోని పలు కీలక పాత్రలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతోంది. తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ ఎదురుదాడులకు పాల్పడింది. మరోవైపు ఇరాన్ నుంచి ఎదురుదాడులు తప్పవని భావించిన ఇజ్రాయెల్.. సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. ఇరాన్ కు చెందిన డెజ్ ఫుల్ ఎయిర్ పోర్టులోని 2 ఎఫ్-5 ఫైటర్ జెట్లను ధ్వంసం చేసింది. ఈ యుద్ధ విమానాలను కూల్చేస్తున్న విజువల్స్ ను కూడా రిలీజ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఎఫ్-14 టామ్ కాట్స్ ఎయిర్ కాఫ్ట్ లను పేల్చేసిన ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్.. ఇప్పుడు ఎఫ్-5 ఫైటర్ జెట్లను కూల్చేసింది.

పాతకాలం యుద్ధ విమానాలతో ఎటాక్స్

వాస్తవానికి ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన ఎఫ్-5, ఎఫ్14 ఫైటర్ జెట్లు పాతవి. వీటిని ఇరాన్ అంతగా ఉపయోగించడం లేదు. చాలా రోజులుగా ఇవి నిరుపయోగంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన విడి భాగాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని పక్కనబెట్టినట్లు సమాచారం. వాటి మీద తాజాగా ఇజ్రాయెల్ దాడి చేసింది. అంతేకాదు, ఇస్ఫహాన్స్ ఎయిర్ పోర్టుతో పాటు మరికొన్ని ఎయిర్‌ పోర్ట్‌ల మీద కూడా దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

తమ ప్రజలకు ఇజ్రాయెల్ సూచనలు

ఇరాన్ ప్రతి దాడులకు దిగిన నేపథ్యంలో తమ దేశ ప్రజలకు ఇజ్రాయెల్ సూచనలు చేసింది. వరుసగా మిసైల్స్ తో దాడులకు దిగిన నేపథ్యంలో దేశ పౌరులంతా సురక్షితంగా ఉండాలని సూచించింది. సేఫ్ ప్లేస్ లను వెళ్లాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప, బయటకు రాకూడదని వెల్లడించింది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ 30 బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సుమారు 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ తన గగన తలాన్ని మూసివేసింది. వరుసగా మిసైల్స్ దాడి జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఫెన్స్ అధికారులు ప్రకటించారు.

Read Also: ట్రంప్ మొదలుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments