
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్ 2026 కి సంబంధించి తాజాగా అబుదాబిలో మినీ వేలం జరగగా అందులో కీలకమైన ప్లేయర్లను ఆయా జట్లు కొనుగోలు చేశాయి. అన్ని బాగున్నాయి అని అనుకున్న సందర్భంలో తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గతంలో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ దేశ క్రికెట్ ప్లేయర్లకు ఐపీఎల్ లో చోటు కల్పించని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా బంగ్లాదేశ్ దేశం కూడా భారత్ తో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ దేశాలతో కూడా సంబంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను తమ దేశంలో భాగంగా చేసుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఒక పోస్టర్ విడుదల చేయడమే దీనికి అసలైన కారణం.
Read also : తెలంగాణ: చలిగాలుల కారణంగా పాఠశాలల వేళల్లో మార్పులు
ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కావాలనే బంగ్లాదేశ్ మన భారత్ ను కవ్వించే చర్యలకు పాల్పడేలా చేస్తుంది అని మన భారత ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహంతోనే ఆ దేశ క్రికెట్ ప్లేయర్లను మన ఐపీఎల్ లో ఆడించడం అవసరమా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లను బంద్ చేసినట్లుగానే బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా బంద్ చేయాలి అని BCCI కు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా జరిగిన మినీ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కత్తా జట్టు 8.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడించాలా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఎలుగుబంటి అవతారం ఎత్తిన నూతన సర్పంచ్.. గ్రామం కోసం దేనికైనా సిద్ధం!





