Saturday, March 7, 2026
Homeక్రీడలుIPL 2025: ఐపీఎల్ ఛాంపియన్ గా ఆర్సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెర!

IPL 2025: ఐపీఎల్ ఛాంపియన్ గా ఆర్సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెర!

IPL 2025 Winner: 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ ట్రోపీ ఎత్తాలనుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) కల నెరవేరింది. ఐపీఎల్ లో కొత్త విజేతగా నిలిచింది. మూడుసార్లు ఫైనల్ లో ఓటమి పాలైన ఆర్సీబీ ఈసారి విజయాన్ని ఒడిసిపట్టింది. ఒకానొక సమయంలో ఓడిపోతారేమో? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

6 పరుగుల తేడాతో పంజాబ్ పై విజయం

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్, ఆర్సీబీ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన తుది మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 6 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. తొలిసారి ఐపీఎల్ విజేత‌గా అవ‌త‌రించింది. విరాట్ కోహ్లీ(43), జితేశ్ శ‌ర్మ‌(24) మెరుపుల‌తో 190 ర‌న్స్ కొట్టింది బెంగళూరు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ను కృనాల్ పాండ్యా(2-17) రాణించ‌డంతో పంజాబ్‌ ను క‌ట్ట‌డి చేసింది. శ‌శాంక్ సింగ్(61 నాటౌట్) చివ‌రి దాకా పోరాడినా ఓట‌మి నుంచి జట్టును బయటపడేయలేకపోయాడు. చివ‌రి ఓవ‌ర్ లో శ‌శాంక్ సిక్స‌ర్ల‌తో చెల‌రేగినా.. బెంగ‌ళూరు విజ‌యాన్ని ఆపలేకపోయాడు.

Read Also: టీచర్ తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు ఆగ్రహం!

ఈ సాలా కప్ నమదే అన్నట్లుగానే..

ఈ సాలా క‌ప్ న‌మ‌దే అంటూ ఐపీఎల్ బ‌రిలో నిలిచే ఆర్సీబీ త‌మ క‌ల‌ను ఎట్టకేలకు సాకారం చేసుకుంది. తొలి సీజ‌న్ నుంచి ట్రోఫీ కోసం ఎంతగానో ఎదురు చూసిన బెంగళూరు జట్టు.. 18వ సీజ‌న్‌లో ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌ ను ఓడించి… టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.  అటు రెండోసారి ఫైన‌ల్ కు చేరిన పంజాబ్ కచ్చితంగా ఛాంపియన్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, లక్ష్య ఛేదనలో పంజాబ్ తబబడింది. ఇప్పటి వరకు దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్… ఫైనల్ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ క్రీజ్ లో నిలవలేకపోయారు. ఫలితంగా పంజాబ్‌ మరోసారి పరాభవం తప్పలేదు.

Read Also: ముందే రుతుపవనాలు, మేలోనే వానలు.. ఏంటీ వింత వాతావరణం?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments