
-మారు మూల గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయిలో సెమినార్
-సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రావుల కృష్ణకు పలువురి ప్రశంశలు
-హైదరాబాద్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు అంతర్జాతీయ గుర్తింపు
-జర్మనీలో సుస్థిర విద్యపై ప్రదర్శన
క్రైమ్ మిర్రర్, సూర్యాపేట:- హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డాక్టర్ రావుల కృష్ణయ్య , పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
“ దేశీయ పద్ధతులు, సృజనాత్మక బోధన, కథలు చెప్పడం ద్వారా ఉన్నత విద్యలో సుస్థిరాభివృద్ధిని మెరుగుపర్చడం” అనే శీర్షికతో వీరు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో మరియు జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్ నగరంలో నవంబర్ 19–21 మధ్య నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.
డాక్టర్ కృష్ణయ్య ఈ సదస్సులో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. స్వదేశీ జ్ఞాన వ్యవస్థలు, కథా పద్ధతులు, కళా ఆధారిత బోధనా విధానాలు ఉన్నత విద్యలో సుస్థిరాభివృద్ధికి ఎలా తోడ్పడతాయనే అంశాన్ని ఈ అధ్యయనం ప్రతిపాదించడం విశేషం. పరిశోధన నాణ్యతను గుర్తిస్తూ నిర్వాహకులు 600 EUR గ్రాంట్ మంజూరు చేశారు.ఈ విజయంతో సృజనాత్మక బోధన, సాంస్కృతిక ఆధారిత విద్యా విధానాలు, సస్టైనబిలిటీ అధ్యయనాలకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం అందిస్తున్న ప్రోత్సాహం మరోసారి ప్రతిఫలించింది
Read also : Oh My God: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.. అది కూడా కార్తీకమాసంలో..
సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలంలోని యం.వి. సింగారం గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలను, పేదరికాన్ని అధిగమిస్తూ పశువుల కాపరి, సెక్యూరిటీ గార్డ్, విద్యా వాలంటీర్‌గా ప్రారంభించి, డిగ్రీ, పీజీ, పీహెచ్.డి పూర్తి చేసి, నేడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగిన డాక్టర్ కృష్ణయ్య సాధించిన ఈ విజయం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం డాక్టర్ రావుల కృష్ణయ్య , పరిశోధకులు సాక్షిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారు జర్మనీలో చేసే ప్రదర్శనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Read also : Divorce Trends: బలహీనమవుతున్న బంధాలు.. పెరిగిపోతున్న విడాకులు





