
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- రాజకీయాలంటేనే అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ఉండడం సహజం. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మహిళా ఐఏఎస్ కు మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ… కొన్ని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఎప్పుడైతే బయట వైరల్ అవుతున్నాయో అప్పటినుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమోషనల్ అవుతూ అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల బదిలీల విషయాలు ఒక మంత్రి చూసుకోరు. అవన్నీ కూడా సీఎం చూసుకుంటారు. కాబట్టి ఎవరూ కూడా ఐఏఎస్ అధికారులపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని.. ఈ విషయంలో నన్ను మానసికంగా వేధించి ఇబ్బందికి గురి చేయొద్దు అని తెలిపారు.
Read also : Shocking: ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు!
తప్పు చేసిన వారిని ఆ దేవుడు కచ్చితంగా శిక్షిస్తారు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారంతో ఇబ్బంది పెట్టే బదులు కోపం ఉంటే అది తీర్చుకోవడానికి కాస్త విషం ఇచ్చి చంపండి అని కోమటిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. నాకు ఈ బతుకు మీద ఒక పెద్దగా ఆశలు లేవు అని నా కొడుకు చనిపోయినప్పుడే సగం చచ్చిపోయాను అని కోమటిరెడ్డి ఎమోషనల్ అవుతూనే మాట్లాడారు. నా కొడుకు పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అని రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత పరువుకు భంగం కలిగించవద్దు అని కోరారు





