
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్లు లేకపోతే అన్నం తినము అని ఏడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా చేసేదేం లేక పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రముఖ ఫ్లాట్ఫామ్ అయినటువంటి ఇంస్టాగ్రామ్ 18 సంవత్సరాలలోపు టీనేజర్ల భద్రత కోసం సరికొత్త రూల్స్ ను తీసుకురానుంది అని ప్రకటించింది. ఇందులో భాగంగానే టీనేజర్ల భద్రత కోసం మేటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG -13 రేటింగ్ మార్గదర్శకాలు ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్ పై రిస్ట్రిక్షన్స్ అనేవి విధించనుంది. దీనిని తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా 18 సంవత్సరాలలోపు యూజర్లు ఎవరైతే ఉంటారో వారందరూ 13 ప్లస్ కేటగిరి సెట్టింగ్స్లోకి వెళ్ళనున్నారు. కాబట్టి వీరు డ్రగ్స్ వాడకం, అడల్ట్ లేక హింసాత్మకమైనటువంటి కంటెంట్లు వారికి కనపడవు. అంతేకాకుండా కేవలం పేరెంట్స్ పర్మిషన్ తోనే ఆ సెట్టింగ్ ను చేంజ్ చేయగలరు అని ఈ సోషల్ మీడియా అధికారులు తెలిపారు. ఇలానే ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్లు ఇలాంటి సెట్టింగ్లను తీసుకురావడం వల్ల టీనేజర్లకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ కొత్త రూల్స్ త్వరలోనే తీసుకురానున్నామని స్పష్టం చేశారు. కాగా ఈ మధ్య పిల్లలు చిన్నతనంలోని చెడిపోతున్న సంఘటనలు ఎదురవుతున్న సందర్భంలో ఇలాంటి కొత్త ఫీచర్స్ను తీసుకురాబోతున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సరైన మార్గంలో పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. అలా సరైన మార్గంలో పెంచని పక్షంలో వారు చెడు అలవాట్లకు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
Read also : బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్!
Read also : “వీళ్ళకి ఇంత బలుపా”.. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పై ఫైర్ అవుతున్న ఇండియన్ నెటిజన్స్