Thursday, February 26, 2026
Homeక్రైమ్నిండు ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్

నిండు ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయ్యారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది మోసపోవడం లేదా చనిపోవడం అనేది జరిగాయి. అయితే ఈ తాజాగా తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి ఒక ఇల్లాలి ప్రాణం ఇంస్టాగ్రామ్ వల్ల గాల్లో కలిసిపోయింది. అసలు విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, చక్ర ద్వారబంధం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంస్టాగ్రామ్ లో గుర్తుతెలియని వ్యక్తితో చాటింగ్ మోజులో పడి తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో చాటింగ్లో మోజు పడింది. చివరికి తన జీవితాన్నే కోల్పోయింది.

Read More : పోలీసులు ఫిర్యాదు పట్టించుకోలేదని…స్టేషన్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చివరికి ఆ వ్యక్తి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం వల్ల తన దగ్గర ఉన్నటువంటి నాలుగు లక్షల రూపాయలను అతనికి ఇచ్చేసింది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో వాళ్ళు ఆ బంగారం విషయం అడగగా అన్నీ కూడా బయటకు వచ్చాయి. దీంతో ఇంట్లో పెద్ద గొడవలు జరిగాయి. దీంతో అవన్నీ భరించలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ మృతురాలికి ఇప్పటికే ఒక పాప ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలి తమ్ముడు ఈ విషయంపై కేసు వేయగ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments