Friday, February 20, 2026
Homeవైరల్Naa Anvesh Instagram: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్, ఇదీ అసలు కథ!

Naa Anvesh Instagram: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్, ఇదీ అసలు కథ!

  • నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్
  • దేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు
  • మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అన్వేష్ అకౌంట్ బ్యాన్

ప్రముఖ యూట్యూబర్  నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్ అయింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. దీంతో ఆ ఖాతా వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. దీంతో వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం స్పందించి వివరాలు పంపించింది.

అన్వేష్ అకౌంట్ తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ కు పోలీసుల లేఖ

అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నుంచి లేఖ వచ్చిన వెంటనే అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించిన మేనేజ్‌మెంట్ బ్యాన్ చేసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది.

తెలుగులో ఎక్కువ మంది వీక్షించే ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ఒకరు. మహిళల వస్త్రధారణపై కొద్ది రోజుల క్రితం చెలరేగిన వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఆ సమయంలో అన్వేష్ ఓ వీడియో చేశాడు. తన వాదన వినిపించే క్రమంలో చెప్పరాని భాష వాడడం, హిందూ దేవతల పేర్లు తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. పురాణగాథల్లో జరగని ఘటనలు జరిగినట్టు అర్థం వచ్చేలా, సీత, ద్రౌపది  గురించి వ్యాఖ్యానించాడు. ప్రవచనకారుల గురించి జుగుప్సాకరంగా మాట్లాడాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments