క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పరిపాలనాపరమైన కారణాలు మరియు మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ లక్ష్యంగా ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది.
ఈ బదిలీలు తక్షణమే (జనవరి 18, ఆదివారం నుండి) అమలులోకి వచ్చాయి అని తెలుస్తుంది. పరిపాలనా సౌలభ్యం, వ్యవస్థలో సమర్థతను మెరుగుపరచడం మరియు సిబ్బంది సమతుల్యతను పాటించడం ఈ బదిలీల వెనుక ప్రధాన లక్ష్యాలు.
పలువురు ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బాధ్యతలు అప్పగించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS), సైబర్ క్రైమ్స్ వింగ్, టాస్క్ ఫోర్స్ మరియు ఇతర యూనిట్ల నుండి సుమారు 26 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
బదిలీ అయిన కీలక ప్రాంతాలు (కొన్ని)
- బంజారాహిల్స్
- ఫిల్మ్‌నగర్
- చార్మినార్
- తప్పచబుత్రా
- సుల్తాన్ బజార్ ట్రాఫిక్
- మలక్‌పేట ట్రాఫిక్
- రాంగోపాల్‌పేట్
- మహాంకాళి
- ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.





