Homeతెలంగాణగులాబీ గూటిలో వారసత్వ పోరు..!

గులాబీ గూటిలో వారసత్వ పోరు..!

  • పాత టిఆర్ఎస్ కోసం గట్టి పోటీ

  • పాదయాత్రలతో ప్రజలకు దగ్గరయ్యే వ్యూహం

  • తెలంగాణలో అన్నా చెల్లెళ్ల వార్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కెసిఆర్ వారసత్వం విషయంలో కుమారుడు కేటీఆర్ వర్సెస్ కుమార్తె కవిత అన్నట్టు పరిస్థితి మారింది. ఒకప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఈ ఇద్దరు ఇప్పుడు.. వారసత్వం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ అనే బ్రాండ్ కోసం పోటీ పడుతున్నారు. పోటా పోటీగా పాదయాత్రలు కూడా చేయబోతున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హిట్ నెలకొంది.

  • టిఆర్ఎస్ పునరుద్ధరణ..

టిఆర్ఎస్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తరువాతే పార్టీ గ్రాఫ్ అమౌంట్ పడిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని గులాబీ పార్టీ శ్రేణులు బలంగా భావిస్తున్నాయి. దీనిపైనే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మనం మళ్లీ టిఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాం. పేరు మార్పు వల్లే ఓడిపోయాం అని ఆయన బాహాటంగానే ఒప్పుకున్నారు. పార్టీని మళ్ళీ తెలంగాణకే పరిమితం చేసి.. పోగొట్టుకున్న వైభవాన్ని వెతకాలని కేటీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తన నాయకత్వంలోనే టిఆర్ఎస్ రీయంట్రీ జరగాలని బలంగా కోరుకుంటున్నారు కేటీఆర్.

  • టిఆర్ఎస్ పై కన్నేసిన ఇద్దరు నేతలు..

మరోవైపు కవిత కూడా టిఆర్ఎస్ పై కన్నేసారు. టిఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పాత పేరుతో, కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్ళేందుకు కవిత సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో మహిళా సమాజాన్ని, తెలంగాణ సెంటిమెంటును తన వైపునకు తిప్పుకోవాలని చూస్తున్నారు కవిత. అయితే అందుకు టిఆర్ఎస్ అనే బ్రాండ్ తనకు ఆయుధంగా మారుతుందని భావిస్తున్నారు. అన్నకంటే ముందే ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పేరును వాడుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

  • ఎత్తుకు పై ఎత్తులు..

టిఆర్ఎస్ గా ఉన్న ఉద్యమ తెలంగాణ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారింది. ఒక జాతీయ పార్టీగా మాత్రమే అవతరించింది. కానీ అలా మారిన క్రమంలో గులాబీ పార్టీ ప్రజలకు దూరమైంది. తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కారు గుర్తు టిఆర్ఎస్ కె అంకితమైంది. అందుకే ఇప్పుడు టిఆర్ఎస్ అనేది ఒక పేరు కాదు.. ఒక రాజకీయ ఆస్తి అని.. ఈ ఆస్తిని దక్కించుకున్న వారే తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా చలామణి అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ అన్నా చెల్లెలు ఇద్దరూ ఆ పేరు చుట్టూ తమ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఎవరికి వారే తాము అసలైన తెలంగాణ వాదులమని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు.

  • పాదయాత్రలకు సైతం..

తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రయోగం చేయాలన్న తలంపుతో ఆ ఇద్దరు అన్నా చెల్లెలు ఉన్నారు. పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. కేటీఆర్ తన పాదయాత్ర ద్వారా పార్టీ యంత్రాంగాన్ని ఉరకలెత్తించాలని చూస్తున్నారు. కవిత మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ తన ఇమేజ్ ను ప్రక్షాళన చేసుకోవాలని చూస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు నేతలు.. ఒకే పేరు కోసం.. ఒకే రకమైన కార్యాచరణతో బయలుదేరుతుండటం మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. గులాబీ గూటిలో జరుగుతున్న వారసత్వ పోరు.. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి ….

  1. రేపు ఉదయం 11 గంటలకు.. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

  2. తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!

  3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వేడెక్కిన రాజ‌కీయం…ఇద్ద‌రు నేత‌లు మాట‌ల యుద్దం…!

  4. ఆపరేషన్ ఐలాపూర్…6 అంత‌స్తుల భ‌వ‌నం నేల‌మ‌ట్టం…!

  5. చిరకాల శత్రువు చెంతకు జీవన్ రెడ్డి.!

  6. Big breaking: ఆప‌రేష‌న్ ఖ‌గార్ ఎఫెక్ట్‌…మ‌రో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు