
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య భక్తులతో పాటుగా చాలామంది సెలబ్రిటీలు కూడా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ కొండపై ఉన్నటువంటి ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దాదాపు పది రోజులపాటు సాగేటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినిమా నటులు, పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ కూడా ఈ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని వాళ్లకు ఉన్నటువంటి కష్టాలను, కోరికలను అమ్మవారికి చెప్పుకుంటున్నారు.
Read also : ఫైనల్ కు చేరిన ఇండియా.. కానీ ఈ చెత్త ఫీల్డింగ్ ఏంటంటూ ఆవేదన!
ఇదంతా ఒక ఎత్తు అయితే… విద్యుత్ దీపాలతో, రంగురంగులుగా విజయవాడ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయినట్లు కనిపిస్తుంది. కృష్ణ బ్యారేజ్ మొదలుకుని ఫ్లై ఓవర్, ఇంద్రకీలాద్రి అంత కూడా రంగురంగులుగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఒక అద్భుతమైన విఎఫ్ఎక్స్ ను తలపించేలా స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు కూడా చాలా ఆసక్తిగా, ఆనందంగా అమ్మవారిని దర్శించుకుంటూ హిందూ ఆలయాలపై ఎంత భక్తి ఉందో నిరూపిస్తున్నారు. మూడవరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక డ్రోన్ నుంచి చూస్తే విజయవాడ అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం దేదీప్యమానంగా వెలిగిపోతూ స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భక్తులే దర్శనమిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ సైతం రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతుండడంతో.. రాత్రిపూట ఈ ప్రాంతాన్ని చూస్తున్న భక్తులు ఇది ఒక ఇంద్ర లోకంలో అనిపిస్తుందని అంటున్నారు.
Read also : ఇచ్చిన మాట నెరవేర్చిన కూటమి.. అభ్యర్థుల ముఖాల్లో వెలుగులు!